స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఏర్పాట్లు చేయాలి. ప్రజావాణి అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు

సీజినల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబంధించి 21 దరఖాస్తులు, ఎంపిడిఓ లకి 10 దరఖాస్తులు, మున్సిపల్ కమిషనర్లకి 3 దరఖాస్తులు, మిగిలిన 15 దరఖాస్తులు వివిధ శాఖలకి సంబంధించి వచ్చాయని మొత్తం 49 దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిష్కరించుటకి సంబంధిత అధికారులకి పంపటం జరిగిందని అధికారులు ప్రజావాణి ఆర్జీలు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఏ పిడి వివి అప్పారావు,డి ఎఫ్ ఒ సతీష్ కుమార్, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి,సి పి ఒ కిషన్, డి ఈ ఒ అశోక్,సంక్షేమ అధికారులు శంకర్, దయానందరాణి, శ్రీనివాస్ నాయక్, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్