జయకేతనం న్యూస్ ఆగస్టు 12
సూర్యాపేట జిల్లా పాలకీడు మండల పరిధిలోని ఎల్లాపురం గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం జన సురక్ష ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ బి ఐ మేనేజర్ రమేష్ హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జన్ ధన్ ఖాతాలు తీసుకోవాలని, అదే విధంగా ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి, అటల్ పెన్షన్ యోజన లాంటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని ఏదైనా ప్రమాదం జరిగితే వీటితో వచ్చే ప్రమాద భీమా తో కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా ఉండొచ్చని అన్నారు. ఆడ పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రధాన మంత్రి సుకన్య సమృద్ధి యోజన పథకం కనీసం నెలకు 1000 రూపాయలు కట్టినట్లయితే పిల్లలకు చదువులకు, వివాహ ఖర్చులకు సైతం ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి కొప్పు రవిచంద్ర, సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్స్ చిలుముల అశోక్ పల్లి శ్రావణ్ కుమార్ వి ఓ ఎ సరస్వతి, ఫీల్డ్ అసిస్టెంట్స్ లక్ష్మయ్య పెరుమాళ్ళసతీష్, చింతల చెరువు సతీష్,గ్రామమహిళలు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు









