జిల్లాలో మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు

 

జయ కేతనం న్యూస్ ఆగస్టు 12

రాబోయే మూడు రోజులు సూర్యాపేట జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తగా జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు ఏర్పాటు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులు ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో డిజాస్టర్ మేనేజ్మెంట్ పై వెబ్ క్స్ ద్వారా జిల్లా ఎస్పి కే నరసింహ, అదనపు కలెక్టర్ పి రాంబాబు లతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 13 నుండి 15 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధాన కార్యదర్శిలు, ముఖ్యమైన అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహించారని తెలిపారు. అధికారులందరికీ రాబోయే మూడు రోజులు పాటు సెలవులు రద్దు చేస్తామని అందరూ కార్యస్థానంలోనే ఉండాలని ఎలాంటి ప్రాణ నష్టం,పశు నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో 24 గంటల పాటు అందుబాటులు ఉండేటట్లు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఎవరికైనా సహాయం కావాలంటే 6281492368 కి ఫోన్ చేసి సమాచారం అందిస్తే వెంటనే సహాయక చర్యలు చేపడతామని ప్రజలకు సూచించారు.జిల్లా స్థాయిలో మూడు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు,డివిజన్ స్థాయిలో,మండల స్థాయిలో ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని వర్షం సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి అందులో నివసిస్తున్న ప్రజలను వారి బంధువులు ఎంటకి తరలించాలని అదేవిధంగా లోటత్తు ప్రాంతాలు ఉన్న ప్రజలను వేరే ఇంటికి తరలించాలని ఆదేశించారు. మున్సిపాల్టీ లలో ముందస్తు జాగ్రత్తగా బృంధాలు, వాహనాలు,సామాగ్రి ఏర్పాట్లుచేసుకోవాలని ఆదేశించారు.
గ్రామాలలో మున్సిపాలిటీలలో ప్రజల కొరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వ కార్యాలయం గుర్తించాలని అన్నారు. రోడ్లపై కల్వర్ట్ లు, బ్రిడ్జిలు, కాజ్వేలు వద్ద నీరు ఆగకుండా ముందస్తుగా చెత్తను తొలగించాలని ఒకవేళ వర్షాల వల్ల రోడ్లపై బ్రిడ్జిలపై వర్షం ప్రవహిస్తే అక్కడ వాహనాలు దారులను వెళ్లకుండా నియంత్రించాలని ఆదేశించారు.రోడ్ల నిర్మాణం కొరకు ఏమైనా గుంటలు తీస్తే ప్రజలకి తెలియజేసేలా ఎర్ర జెండాలు, రేడియం స్టికర్ ద్వారా సూచించాలని ఆదేశించారు.జాతీయ రహదారులు పై నీరు ఆగకుండా చూడాలని, అధికారులు ప్రత్యేక బృంధాలు, ఏర్పాట్లు చేసుకొని వాహనదారులకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే వెంటనే సరీ చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు నిరంతరంగా సరఫరా చేయాలని విద్యుత్ కేబుల్ లైన్లో తెగిపడిన వెంటనే చేయాలని ఆదేశించారు.చెరువులు నిండుగా ఉన్నాయని అక్కడికి ప్రజలను వెళ్లకుండా, అలాగే చేపల వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని గజ ఈతగాలను సిద్ధం చేయాలని తెలిపారు.
రైతులు రాబోయే మూడు రోజులు పొలాలకి వెళ్లకుండా చూడాలని, అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇల్లు కట్టేవద్దే రేకులు వేసుకొని ఉండకుండా వేరే ఇంటిలోకి వెళ్లాలని, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల ముందు డ్రైనేజి ముసివేశారని అక్కడ క్లీన్ చేసి నీరు ప్రవహించేలా చూడాలని ఆదేశించారు.హెల్త్ & మెడికల్ అధికారులు గ్రామ స్థాయినుండి జిల్లా హాస్పిటల్ వరకు అందరు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆశ వర్కర్స్, అంగన్వాడీ సిబ్బంది ద్వారా రాబోయే 15 రోజులు ప్రసూతి అయ్యే వారి వివరాలను సేకరించి పి హెచ్ సీ, ఏరియా హాస్పిటల్, జి జి హెచ్ నందు ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.మండలాల ప్రత్యేక అధికారులు రాబోయే మూడు రోజులు క్షేత్ర స్థాయి లో పరిశీలించి రెవిన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, హెల్త్ & మెడికల్, పశు సంవర్ధన శాఖ, వ్యవసాయ శాఖ, ఆర్ & బి, ఇరిగేషన్ అధికారులను సమన్వయము చేసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.ఈ సమావేశం లో ఆర్డీఓ వేణుమాధవ్, డి ఎఫ్ ఓ సతీష్ కుమార్, డి ఆర్ డి ఏ పిడి వివి అప్పారావు, డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్