జయకేతనం న్యూస్ ఆగస్టు 13
భూ భారతి చట్టం అమలుకు ఎంపిక చేసిన లైసెన్స్ సర్వేయర్ ల మొదటి విడత 238 అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమం తేది 26.05.2025 నుండి 29.07.2025 వరకు 50 రోజులు శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించడం జరిగిందని రెండవ విడత 266 మంది లైసెన్స్ సర్వేయర్ లకు తేది.18-08-2025 నుండి 22-10-2025 వరకు 50 రోజులు శిక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు శిక్షణ పూర్తి అయిన తరువాత పరీక్షలు నిర్వహించ బడతాయన్నారు.ఈ కార్యక్రమం లో భాగంగా తేది. 18-08-2025 సోమవారం ఉదయం 9-30 లకు సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం మొదటి అంతస్తులో ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్సు ప్రతులతో వెరిఫికేషన్ కి హాజరై తరువాతి రోజు నుంచి మొదలయ్యే శిక్షణని సద్వినియోగం చేసుకోవాలని
జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.









