పేద ఆర్యవైశ్యులకు అండగా నిలవాలి సహకరించిన దాతలకు ధన్యవాదాలు

జయకేతనం న్యూస్ ఆగస్టు 14

పేద ఆర్యవైశ్యులకు ఆపద వస్తే అండగా నిలవాలని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన పేదింటి సరస్వతి పుత్రుడు కొణతం సాయి కార్తికేయ ప్రతిభ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.సాయి కార్తికేయ తండ్రి అనారోగ్యంతో మరణించడంతో తల్లి రోజు వారి పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ సాయి కార్తికేయను చదివిస్తున్నారు.ఇటీవల కార్తికేయ అమ్మమ్మ కూడా అనారోగ్యంతో మరణించడంతో ఆర్యవైశ్యుల సహకారంతో దహన సంస్కారాలు సైతం నిర్వహించారు. వచ్చిన ఆర్థిక సహాయంతో దహన సంస్కారాలను నిర్వహించగా, మిగిలిన ఆర్థిక సహాయము రూ.20 వేల రూపాయలను సాయి కార్తికేయకు కాలేజీ ఫీజుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో సమాచారం తెలుపగా ఎంతోమంది దాతలు స్పందించి ముందుకు రావడం హర్షనీయమని అన్నారు.ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదలకు ఏ ఆపద వచ్చిన అండగా నిలిచి, సహాయ సహకారాలు అందించాలని కోరారు.అండగా నిలిచిన దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పురం నాగరాజు,సాయి కార్తికేయ లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్