జయకేతనం న్యూస్ ఆగస్ట్ 22
కోదాడ కే ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనుబంధంగా ఉన్న బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ కు రీజినల్ స్టడీ సెంటర్ ను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బానోతు ధర్మానాయక్ అన్నారు. శుక్రవారం కోదాడ కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అనుబంధంగా ఉన్న బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఎస్టీ స్టడీ సెంటర్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీజినల్ సెంటర్ ఏర్పాటు వల్ల దూర విద్యలో చదివే సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ తరగతుల కోసం నల్లగొండకు రాకుండా ఇక్కడే ప్రాక్టికల్ నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య ద్వారా చదువు మధ్య లో మానేసిన వారు తిరిగి చదువులు కొనసాగించి ఉన్నత విద్య పూర్తిచేసే అవకాశం ఉందన్నారు.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కోయ,చెంచు, వికలాంగులు,ట్రాన్స్ జెండర్లకు ఎలాంటి కోర్సు ఫీజు చెల్లించ కుండా ఉన్నత విద్య చదువు కునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. కమీషనర్ దేవసేన, యూనివర్సిటీ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆదేశాల మేరకు ప్రతి స్టడీ సెంటర్లో 500 మంది విద్యార్థులు చేరేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తు న్నామన్నారు. రెగ్యులర్ విద్యా ర్థుల మాదిరిగా దూరవిద్య విద్యార్థులకు కూడా త్వరలో స్కాలర్షిప్ లు మంజూరు చేసేం దుకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని త్వరలోనే విద్యార్థులకు ఆ సౌకర్యం కల్పిస్తామన్నారు.ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్,స్టడీ సెంటర్ కౌన్సిలర్లు అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హదసరాణి, జర్నలిజం ప్రొఫెసర్ గిరి గౌడ్, వైస్ ప్రిన్సిపల్ చందా అప్పారావు, కోఆర్డినేటర్ జి సైదులు, బి సైదిరెడ్డి, అధ్యాపకులు శ్రీలత, ఫ్రాన్సిస్, ఎస్ఎం రఫీ, కే సైదులు, టి రాజు, సైదమ్మ, ఆకుల రాజు, జాక్టో సురేష్ నాయక్ తదితర అధ్యాపక బృందం పాల్గొన్నారు









