
జయకేతనం న్యూస్ ఆగస్టు 23
జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధనకు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విద్యార్థినిలకు సూచించారు.శనివారం ఆయన సూర్యాపేట పట్టణం లోని మహాత్మా జ్యోతి బాపూలే బి సి వెల్ఫేర్ రెసిడెన్సీయల్ పాఠశాల, కళాశాలను ఆకస్మిఖంగా విద్యార్థినిలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.కలెక్టర్ విద్యార్థినీలతో భోజనం చేస్తూ చదువు,ఇతరఅంశాలపై అభిప్రాయాలు, తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.తదుపరి డిగ్రీ రెండవ సంవత్సరం విద్యార్థినిలతో మాట్లాడుతూ జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారని? ప్రశ్నించారు.
అవినీతి రహిత సమాజాన్ని రూపొందించేందుకు సివిల్స్, గ్రూప్స్ పరీక్షలు రాసి ప్రభుత్వ అధికారులమవు తామని,డాక్టర్,టీచర్,సిఏ ఇండియన్ ఫారెస్ట్ అధికారి,జూనియర్ లెక్చరర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉందని కలెక్టర్ కు విద్యార్థినిలు తెలిపారు కలెక్టర్ విద్యార్థినిలకు కెరియర్ పై దిశా నిర్దేశం చేస్తూ ఒకసారి జీవితంలో ఏమి అవ్వాలో నిర్ణయించుకున్న తర్వాత మధ్యలో మార్చుకోకూడదని, అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ గమ్యాన్ని చేరేంతవరకు కష్టపడి చదువుకోవాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో డిమాండ్ ఏ రంగంలో ఉందో తెలుసుకోని, అనుభవం ఉన్న వారి సలహా తీసుకోని,నైపుణ్యాల ను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు.ఐటీ, మెడికల్, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్,టీచర్ బిజినెస్, సి ఏ,వంటి ఏ రంగాల్లో
ఇష్టమో, ఏ రంగంలో ప్రతిభ ఉందో గుర్తించి ఆదిశగా అడుగులు వేయాలని అన్నారు.వాటిని చేరుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని,
జీవితంలో విజయం సాధించడానికి పట్టుదల, సహనం, ఆత్మవిశ్వాసం అవసరమని తెలిపారు. 5వ తరగతి నుండి డిగ్రీ వరకు 852 మంది విద్యార్థినులు ఇక్కడ చదువు కుంటున్నారని,డిగ్రీ విద్యార్థినిలకు ప్రత్యేకంగా కళాశాల కొరకు సూర్యాపేట పట్టణం విద్యా నగర్ మెట్రో హాస్పిటల్ వెనుక భాగం లో భవనమును ఏర్పాటు చేశామని వివరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ ఆ భవనం పరిశీలించి మంచిగా పెయింట్స్ వేయాలని,తరగతి గదులలో లైటింగ్స్, ప్యాన్స్ ఏర్పాటు చేయాలని, టాయిలెట్స్, బాత్ రూమ్ లు వేరు వేరుగా ఏర్పాటు చేయాలని, ప్రతి ఫ్లోర్ లో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బి సి వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ నాయక్, ఆర్ సి ఒ స్వప్న, డి సి ఒ లక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.









