జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 04
మత్స్య సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి ఆమోదించడం కోసం అధికారిక సహాయం చేసేందుకు ఫిర్యాదు దారుడు నుండి రూ.20,000/-లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోని జిల్లా మత్స్యకార అధికారిణి ఎం. చరితారెడ్డి పట్టుబడ్డారు.ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్, సీఐ బి వెంకట్రావు పాల్గొన్నారు.ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.”ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని తెలంగాణ అనిశా అధికారులు ప్రకటన విడుదల చేశారు









