1,80,000/- లకు లడ్డూనిదక్కించుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి

అంగ రంగ వైభవంగా 3వార్డ్ గణేష్ నగర్ గణేశుడి నిమజ్జన కార్యక్రమం

1,80,000/- లకు లడ్డూనిదక్కించుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి

జయకేతనం న్యూస్ సెప్టెంబర్05

హుజూర్ నగర్ పట్టణంలో తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. 3వ వార్డు గణేష్ నగర్ లో వినాయకుడి తో పాటు తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి ప్రసాద లడ్డు వేలం పాట లో 1,80,000/- లకు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి దక్కించుకున్నారు. ఈసందర్భంగా మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో, మహిళా మణుల కోలాట నృత్య ప్రదర్శనలతో 36కేజీ ల లడ్డు ను ఊరేగింపు గా కుటుంబ సమేతంగా తీసుకెళ్లారు ఈ సందర్భంగా సంపత్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు వార్షికోత్సవాలుగా గణేష్ నగర్ లో ఘనంగా గణేశుని ఉత్సవాల నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహం తోటి ఉత్సవాలు నిర్వహించామని, ప్రతిరోజు సాయంత్రం వేళలో చిన్నపిల్లలకు డాన్స్ బేబీ డాన్స్, ఆటల, పాటల పోటీలు, మహిళలకు కోలాట, భరతనాట్య ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు ఘనంగా నిర్వహించామని, మహా అన్నదాన కార్యక్రమాల్లో మూడు వేలకు మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.నిమజ్జన కార్యక్రమం లో మహిళా మణులు అందరూ ఒకే ఒకే కలర్ రకం చీరలతో కోలాట ప్రదర్శన ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సంకలమద్ది అశోక్ రెడ్డి, వట్టి కూటి శ్రీనివాస్ గౌడ్, AGP సురేష్ నాయక్, సక్రనాయక్, నంద్యాల వెంకట్ రెడ్డి, గంజి శివ,సులువ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు బచ్చలకూరి బాబు,వెంకటనారాయణ, కొండా నాయక్,అనంత రాములు, పాలెపు నాగరాజు నకీరకంటి అంజయ్య, చందర్రావు, వెంకట్ రెడ్డీ, నాగేంద్రబాబు కాలనీవాసులు, పెద్ద ఎత్తున మహిళలు, పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్