ఏసీబీకి చిక్కిన పట్టణ ప్రణాళిక అధికారిణి -ఎస్. మణి హారిక
జయ కేతనం న్యూస్ సెప్టెంబర్ 9
ఫిర్యాదుధారునికి చెందిన బహిరంగంగా గల ఒక ప్లాటు యొక్క క్రమబద్ధీకరణకు LRS ప్రొసీడింగ్‌లను జారీ చేయడానికి మరియు అట్టి ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి” అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి మొదటగా రూ.10,00,000/- (పది లక్షలు)లంచం డిమాండ్ చేసి అందులో రూ.4,00,000/- (నాలుగు లక్షలు)
లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు “హైదరాబాద్, నార్సింగి పురపాలక సంఘం” యొక్క పట్టణ ప్రణాళిక శాఖ లోని పట్టణ ప్రణాళిక అధికారిణి – ఎస్. మణి హారిక. పట్టుబడ్డారు. అనంతరం ఆమెను ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్ట్ లో ప్రవేశపెట్టారు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.”ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు ప్రజలకు తెలిపారు









