సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజులో 5104 కేసులు పరిష్కారం
జయ కేతనం న్యూస్ సెప్టెంబర్ 13
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ నందు న్యాయశాఖతో సమన్వయంగా పని చేసి సూర్యాపేట జిల్లా పోలీస్ పెండింగ్ లో ఉన్న కేసుల్లో 5104 కేసులను పరిష్కరించడం జరిగిందని జిల్లా ఎస్పీ నరసింహ ప్రకటన ద్వారా తెలిపారు. ఇందులో 666 క్రిమినల్ కేసులు, 2156 ఈ-పెట్టీ కేసులు, 2282 యం.వి యాక్ట్, డ్రంకన్ డ్రైవ్ కేసులు పరిష్కరించడం జరిగినది అన్నారు. పోలీస్ శాఖ కోర్టులతో సమన్వయంగా పటిష్టంగా పనిచేయడం వల్ల ఈ కేసులు పరిష్కరించడం సాధ్యమైందని తెలిపారు. దీనికోసం ప్రణాళికతో పనిచేసి పరిష్కరించదగిన కేసులను ముందుగానే గుర్తించాం అన్నారు. ఈ మతంలో బాగా పనిచేసిన జిల్లా పోలీస్ శాఖ సిబ్బందిని ఎస్పీ అభినందించారు









