50,000/- లంచం తీసుకుంటుండగా ఏసీబీ చిక్కిన సబ్-ఇన్‌స్పెక్టర్ సిహెచ్. విజయ్ కుమార్,కానిస్టేబుల్ (డ్రైవర్)రాజు

50,000/- లంచం తీసుకుంటుండగా ఏసీబీ చిక్కిన సబ్-ఇన్‌స్పెక్టర్ సిహెచ్. విజయ్ కుమార్,కానిస్టేబుల్ (డ్రైవర్)రాజు

జయకేతనం న్యూస్ నవంబర్ 12

సిద్దిపేట పోలీసు కమీషనరేట్‌లోని ములుగు రక్షక భట నిలయంలోని సబ్-ఇన్‌స్పెక్టర్ సిహెచ్.విజయ్ కుమార్,కానిస్టేబుల్ (డ్రైవర్)రాజు రూ.50,000/- లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుధారుని యొక్క సోదరికి సంబందించిన ఒక నివాసయోగ్యమైన ఆస్తి ఎవిక్షన్ ప్రాసెస్ కు సంబంధించిన ప్రక్రియలో ఆమెను హక్కుధారిగా ఉంచేందుకు గాను ఇతర శాఖ అధికారులకు సహాయం చేయడానికి మరియు ములుగు రక్షకభట నిలయములో అతను ఫిర్యాదు చేస్తే నమోదైన ఒక కేసులో అతనికి సహాయం చేసినందుకు ఫిర్యాదుధారున్ని 50,000/- డిమాండ్ చేయడంతో ఇవ్వడానికి ఇష్టపడని ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో సబ్-ఇన్‌స్పెక్టర్ సిహెచ్.విజయ్ కుమార్,కానిస్టేబుల్ (డ్రైవర్)రాజు ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్