15,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన జిల్లా సహాయ కార్మిక అధికారి కర్నె చందర్
జయకేతనం న్యూస్ నవంబర్ 24
ఫిర్యాదుధారుని తండ్రి మరణానికి సంబంధించి లబ్ధిదారుడు చేసుకున్న దరఖాస్తును ఉన్నత అధికారులకు పంపి తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు క్రింద అంత్యక్రియల ఖర్చుల కొరకు రూ.1,30,000/- మంజూరు చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/-లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా సహాయ కార్మిక అధికారి – కర్నె చందర్ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు.









