

అక్రమాస్తుల కేసులో ఏసీబీ సోదాలు
భారీగా ప్లాట్లు, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో వ్యవసాయ భూములు
దర్యాప్తును కొనసాగిస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులు
జయకేతనం న్యూస్ డిసెంబర్ 4
రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ భూ రికార్డుల కార్యాలయములో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న కొంతం శ్రీనివాసులు పైన తెలంగాణ అనిశా అధికారులు అక్రమ ఆస్తుల కేసు నమోదు చేశారు అనిశా అధికారులు అతనికి మరియు అతని బంధువులకు సంబంధించిన 6 స్థలాలలో గురువారం సోదాలు నిర్వహించి హైదరాబాద్ లోని రాయదుర్గం- మై హోమ్ భుజాలో 1ఫ్లాట్ మహబూబ్ నగర్ లో 4 ప్లాట్లు నారాయణపేట జిల్లాలో ఒక రైస్ మిల్లుతో పాటుగా 3 ప్లాట్లు, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురములో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి
కర్ణాటకలో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి,2 చతు:చక్ర వాహనాలు మరియు 1.6 కిలోల బంగారం 770 గ్రాముల వెండి ఆభరణాల వంటి స్థిర,చరాస్తులతో పాటు ఐదు లక్షల రూపాయల నగదు కలిగి ఉన్నట్లు గుర్తించినారు కేసు దర్యాప్తులో ఉన్నదని ఏసీబీ అధికారులు తెలిపారు









