తెలంగాణ ఏసీబీ వారోత్సవాల గోడ పత్రిక ను ఆవిష్కరించిన కలెక్టర్ ఇలాత్రిపాఠి
జయకేతనం న్యూస్ డిసెంబర్ 5
లంచాలు అడగడం, స్వీకరించడం నేరమని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి అన్నారు.ఈ నెల 3 నుండి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఏసీబీ వారోత్సవాలలో భాగంగా లంచం నేరమని తెలిపేలా రూపొందించిన గోడ పత్రికను ఆమె ఏసీబీ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి.అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయని కలెక్టర్ తెలిపారు









