రూ.9,000/-లంచం ఫోన్‌పే ద్వారా తీసుకొని ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ జి. భీమన్న
జయకేతనం న్యూస్ డిసెంబర్ 18
ఫిర్యాదిధారుని జీపీఎఫ్, సరెండర్ లీవ్ మరియు ఎఫ్‌టీఏ బిల్లులను తయారు చేయడానికి,అలాగే మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను సిద్ధం చేయడానికి ఫిర్యాదిధారుని నుండి నిర్మల్ జిల్లా, భైంసా మండలం, తానూర్ ప్రా.వై.శా. ఇన్‌ఛార్జి అండ్ బాసర ప్రాథమిక వైద్యశాలలోని సీనియర్ అసిస్టెంట్ జి. భీమన్న లంచంగా రూ.9,000/-ఫోన్‌పే ద్వారా తీసుకొని
తెలంగాణఅనిశా అధికారులకు పట్టుబడ్డాడు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునన్నారు.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని తెలిపారు









